అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి ధర్పల్లి శ్రీధర్ ఇంట్లో చొరబడిన దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు తులాల బంగారు నగలతో పాటు రెండున్నర లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ.. వాటిని ధ్వంసం చేశారు. సీసీ కెమెరాల డీవీఆర్ ని సైతం ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ పోలీసులు తెలిపారు.