నగర ప్రజల సమస్యలు పరిష్కరిస్తా..

0

అక్షరటుడే, ఇందూరు: నగరంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు పరిష్కరిస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. బుధవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన దృష్టికి స్థానికులు పలు సమస్యలు వివరించారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని స్పష్టం చేశారు. ధన్ పాల్ వెంట కమిషనర్ మకరంద్ బీజేపీ నాయకులు మధు, పవన్, నరేశ్, నందకిశోర్ ఉన్నారు.