అక్షరటుడే, ఆర్మూర్: జిల్లాకు నవోదయ పాఠశాల మంజూరవడంలో కృషిచేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఆలూరు మండల బీజేవైఎం అధ్యక్షుడు ప్రళయ్ తేజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్‌ ప్రాంతంలో నిర్మిస్తే ఆర్మూర్ ప్రాంత విద్యార్ధులకు సౌకర్యంగా ఉంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు.