చిక్కిన సౌత్ ఆర్ఐ రాజు
అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. సౌత్ మండలం ఆర్ఐ రాజును నేరుగా పట్టుకున్నారు. కార్యాలయంలో భూమి పని నిమిత్తం ఓ వ్యక్తి నుంచి రూ.8 వేలు లంచంగా డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. కాగా.. గురువారం ఆర్ఐ ను నేరుగా పట్టుకున్నారు. ప్రస్తుతం సౌత్ తహశీల్దార్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. రాజు తో పాటు సిబ్బంది హరీశ్ ను సైతం ఏసీబీ విచారిస్తోంది.