అక్షరటుడే, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ జోరు పెంచింది. ఎన్నికల కోసం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా పార్టీ అధిష్టానం పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. కాగా పార్టీలోని కీలక నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, డీకే అరుణ, కిషన్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వకపోవడం గమనార్హం.
నియోజకవర్గాల ఇన్‌చార్జులు వీరే..
నిజామాబాద్ – ఏలేటి మహేశ్వర్, కరీంనగర్ – ధన్‌పాల్ సూర్యనారాయణ, మల్కాజ్‌గిరి – పైడి రాకేశ్‌రెడ్డి, జహీరాబాద్ – కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మెదక్ – హరీశ్‌బాబు, సికింద్రాబాద్ – డాక్టర్ కె.లక్ష్మణ్, హైదరాబాద్ – రాజాసింగ్, చేవెళ్ల – వెంకట నారాయణ రెడ్డి, ఆదిలాబాద్ – పాయల్ శంకర్, పెద్దపల్లి – రామారావు పటేల్, మహబూబ్‌నగర్ – రామచందర్ రావు, నాగర్‌కర్నూల్ – రంగారెడ్డి, నల్లగొండ – చింతల రామచంద్రారెడ్డి, భువనగిరి – ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, వరంగల్ – మర్రి శశిధర్‌రెడ్డి, మహబూబాబాద్ – గరికపాటి మోహన్‌రావు, ఖమ్మం – పొంగులేటి సుధాకర్‌రెడ్డి