అక్షరటుడే, ఇందూరు: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. పీఎంశ్రీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా పలు బడులకు నిధులను విడుదల చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న పాఠశాలలకు అదనపు తరగతి గదులు నిర్మించాలని, సైన్స్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందులో భాగంగా ఒక్కో యూనిట్‌కు రూ.13.50 లక్షలు కేటాయించింది.
జిల్లాలోని ఈ పాఠశాలల్లో..
నిజామాబాద్ జిల్లాలో సైన్స్ ల్యాబ్‌లకు15 పాఠశాలలు, అదనపు తరగతి గదులకు 10 పాఠశాలలను ఎంపిక చేశారు. సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ఎంపికైన పాఠశాలల జాబితాలో.. జడ్పీహెచ్ఎస్ బాల్కొండ, జడ్పీహెచ్ఎస్ భీమ్‌గల్, పల్లికొండ, జడ్పీహెచ్ఎస్ చందూర్, టీఎస్ఎంఎస్ ధర్పల్లి, సోషల్ వెల్ఫేర్ ధర్మారం, జడ్పీహెచ్ఎస్ ఎల్లారెడ్డిపేట, జడ్పీహెచ్ఎస్ జక్రాన్‌పల్లి, జడ్పీహెచ్ఎస్ కోనసముందర్, జడ్పీహెచ్ఎస్ కోటగిరి, జడ్పీహెచ్ఎస్ గొట్టుముక్కల, సోషల్ వెల్ఫేర్ నిజామాబాద్(మోపాల్), కేజీబీవీ నవీపేట్, జడ్పీహెచ్ఎస్ కోటగల్లి, కేజీబీవీ వర్ని ఉన్నాయి. అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎంపికైన స్కూళ్లు.. జడ్పీహెచ్ఎస్ మగ్గిడి, జడ్పీహెచ్ఎస్ బాల్కొండ, జడ్పీహెచ్ఎస్ ఎల్లారెడ్డిపేట్, జడ్పీహెచ్ఎస్ జక్రాన్‌పల్లి, జడ్పీహెచ్ఎస్ కోన సముందర్, కేజీబీవీ నవీపేట్ (5యూనిట్లు), జడ్పీహెచ్ఎస్ వేల్పూర్, కేజీబీవీ వర్ని(5యూనిట్లు), జడ్పీహెచ్ఎస్ కోటగల్లి ఉన్నాయి.