అక్షరటుడే, ఇందూరు : ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 70 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, డీఆర్డీవో సాయాగౌడ్‌, ఇన్‌చార్జి డీపీవో శీనివాస్‌, బోధన్‌ ఏసీపీ పీ శ్రీనివాస్‌, అధికారులు పాల్గొన్నారు.