అక్షరటుడే, ఇందూరు: తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. డిసెంబర్ నెలకు సంబంధించిన పారితోషికాలు చెల్లించకపోవడంతో ఆశా వర్కర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అనంతరం డీఎంహెచ్ఓను కలిసి వినతిపత్రం అందించారు.