అక్షరటుడే, వెబ్ డెస్క్: జక్రాన్ పల్లి ఘటనలో బ్రెయిన్ డెడ్ అయిన తేజశ్రీ మృతి చెందింది. అవయవ దానానికి కుటుంబీకులు హైదరాబాద్ లోని జీవదాన్ కు తరలించారు. అయితే అప్పటికే తేజశ్రీ మృతి చెందిందని, అవయవాలు ఏవీ పనిచేయటం లేదని అక్కడి వైద్యులు ధృవీకరించారు. దీంతో పోలీసుల సూచన మేరకు మృతదేహాన్ని శుక్రవారం నిజామాబాద్ మార్చురీకి తరలించారు. శవ పరీక్ష అనంతరం కుటుంబీకులకు అప్పగించనున్నారు. ఈ నెల 23న ప్రేమోన్మాది దాడిలో తేజశ్రీ బ్రెయిన్ డెడ్ అయ్యింది. అప్పటి నుంచి ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. ఈ ఘటనలో ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తేజశ్రీ మృతి పట్ల జాతీయ రహదారిపై గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.