అక్షరటుడే, బోధన్: బాలికలకు పౌష్టికాహారం అందించాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రాధిక సూచించారు. బుధవారం బోధన్‌లో బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా పౌష్టికాహారం, రక్తహీనత పై అవగాహన కల్పించారు. ప్రతిరోజు ఆకుకూరలు, తాజా పండ్లు తినాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు విక్టోరియా రాణి, రత్న సరోజ, అర్చన, లక్ష్మి పాల్గొన్నారు.