అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీని వీడారు. మాజీ కార్పొరేటర్ సహదేవ్, న్యాయవాది తుల గంగాధర్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సమక్షంలో శుక్రవారం కాషాయ కండువా కప్పుకున్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ కేవలం బీజేపీతోనే సాధ్యమని, అందుకే తాము పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ళ లక్ష్మినారాయణ, గడ్డం రాజు, పుట్ట వీరేందర్, బొట్టు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.