బోధన్ లో గంజాయి పట్టివేత

అక్షరటుడే, బోధన్: పట్టణంలో పోలీసులు పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి నుంచి 2 కిలోల గంజాయి సీజ్ చేసినట్లు ఏసిపి కిరణ్ కుమార్ తెలిపారు. అనీసానగర్ లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో మంగళవారం పోలీసులు తనిఖీలు జరిపారు. గంజాయి అమ్ముతున్న వ్యక్తి షేక్ అహ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రెండు కిలోల గంజాయిని సీజ్ చేశారు. కొండల్వాడికి చెందిన మహిళ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపాడు. అనంతరం కొండల్వాడికి చెందిన పార్వతీ బాయి అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను రిమాండ్ కి తరలించినట్లు ఏసిపి తెలిపారు. కేసులో కీలకంగా వ్యవహరించిన సీఐ వీరయ్య బృందాన్ని అభినందించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Bodhan Bar Association | బోధన్​ బార్​ అసోసియేషన్​ కార్యవర్గం ప్రమాణ స్వీకారం