అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి మంజులమ్మ గురువారం మృతి చెందారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్ది సేపటి కిందట తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని మంత్రి తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. శుక్రవారం వెల్పూర్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.