అక్షరటుడే, బాల్కొండ: సమాజంలో అనాధ బాలల విద్యాభివృద్ధికి మహిళా ఉపాధ్యాయులు కృషి చేయాలని పిఆర్టియూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల సందర్భంగా ఉన్నత పాఠశాల వేల్పూర్ లో మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా శక్తి ప్రపంచ శక్తి కావాలని అన్నారు. ముఖ్య అతిథి మండల విద్యాశాఖ అధికారిణి వనజా రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో విద్యాభివృద్ధికి మహిళా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. 35 మంది మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పిఆర్టియూ అధ్యక్షుడు అంకం నరేష్, ప్రధాన కార్యదర్శి బోడ దేవానందం, రాష్ట్ర ప్రధాన పత్రిక సంపాదకుడు పెంట జలంధర్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు తుమ్మల లక్ష్మణ్, నిజామాబాద్ డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కాంతన్న, నరసింహారావు, అంబుజారాణి, వేల్పూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు రాజన్న, అంక్సాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు మల్లీశ్వరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మమత, రవీందర్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, రాజేంద్ర గౌడ్, విజయ్ కుమార్, వినయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శిలు నర్సయ్య, నంబి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ముత్తన్న, మండల అసోసియేట్ అధ్యక్షుడు సుధీర్ కుమార్, మహిళా ఉపాధ్యక్షురాలు శైలజ, మండల కార్యదర్శి అంజలి, మోతే ప్రధానోపాధ్యాయుడు గణేష్ తదితరులు పాల్గొన్నారు.