అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: మాక్లూర్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అనురాధపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు బుధవారం విన్నవించారు. స్పెషల్ ఆఫీసర్ టీచర్లు, సిబ్బందితో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని వివరించారు. అలాగే అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఆమెపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.