అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ శివారులో మొరం అక్రమ తవ్వకాలు జరుగుతుండడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు చేశారు. అక్రమంగా మైనింగ్ జరుగుతుందన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజు, సీఐ అంజయ్య, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. మూడు మొరం టిప్పర్లు, ఒక జేసీబీని సీజ్ చేసి నలుగురిని అదుపులోకి తీసుకొని రూరల్ పోలీసులకు అప్పగించారు.