అక్షరటుడే, నిజామాబాద్: కమిషనరేట్ లోని మోపాల్ స్టేషనులో పనిచేస్తున్న కానిస్టేబుల్ మూర్తి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు మహిళల మధ్యన జరిగిన గొడవలో తలదూర్చడమే సస్పెండ్ కి కారణమని తెలిసింది. అయితే.. మహిళల్లో ఒకరు సస్పెండ్ అయిన మూర్తి భార్యే కాగా.. మరొకరు ఏఆర్ ఇన్స్పెక్టర్ భార్య. వీరిరువురి ఇళ్లు పక్కపక్కనే ఉండగా.. రెండ్రోజుల కిందట ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో కానిస్టేబుల్ తలదూర్చి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ సీపీ దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరిపించి మూర్తిని విధుల నుంచి తొలగించారు.