అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ దామ సునీల్ డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో పారిశుద్ధ్యలోపం స్పష్టంగా కనబడుతుంద న్నారు. విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించకపోవడం శోచనీయమన్నారు. నగర కార్యదర్శి జగదీష్, బాలకృష్ణ, ఇంద్రసేన, శ్రీకాంత్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.