రావి ఆకుపై అయోధ్య రాముని చిత్రీకరణ

0

అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ మండలం పోచారం తండాకు చెందిన సూక్ష్మ కళాకారుడు సరి చంద్ అయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకొని రావి ఆకుపై శ్రీరాముడు, ఆంజనేయుని ప్రతిమలను చిత్రీకరించాడు. సూక్ష్మ కళల పట్ల మక్కువతో ఆకులు, సుద్ద ముక్కలు, సబ్బు బిల్లలపై చిత్రాలు గీస్తున్నట్లు తెలిపారు. అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రావి ఆకుపై చిత్రీకరించిన చిత్రాలపై తండావాసులు, గ్రామస్థులు అభినందించారు.