రిమాండ్ ఖైదీ మృతి

0

అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి సబ్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న యూసుఫ్ ఆదివారం మృతి చెందాడు. నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. మాచారెడ్డి మండలం గజ్యా నాయక్ తండాకు చెందిన యూసుఫ్ సొంత అక్క రుక్సానను ఈ నెల 12వ తారీఖున నడిరోడ్డుపై హత్య చేశాడు. అనంతరం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. శనివారం కడుపునొప్పితో బాధపడుతున్న యూసుఫ్ ను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు యూసుఫ్ మృతి చెందగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.