లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ కు అవార్డులు

0

అక్షరటుడే, నిజామాబాద్ నగరం: లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ కు అవార్డుల పంట పండింది. గత 6 నెలలుగా నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలకు గాను రీజియన్ కాన్ఫరెన్స్ లో చైర్మెన్ శంకర్ అవార్డులు ప్రధానం చేశారు. ఆదివారం లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వైటల్ రీజియన్-3 మీట్ కార్యక్రమం అమృత గార్డెన్స్ లో నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ కు మంత్లీ రిపోర్టింగ్, ఉమెన్ హైజీన్ అవగాహన, ఇంటిమేట్ వాష్ పంపిణీ, ఉచిత ఆరోగ్య పరీక్షలు, హాంగర్ రిలీఫ్, డయాబేటిక్ క్యాంప్, కాన్సర్ అవగాహన, హరితహారం, తదితర విభాగాల్లో అవార్డులు దక్కాయి. వ్యక్తిగత విభాగంలో ఎక్సలెంట్ అధ్యక్షునిగా విజయానంద్, ఎక్సలెంట్ కార్యదర్శిగా చింతల గంగాదాస్, ఎక్సలెంట్ కోశాధికారిగా మచ్చ రవీందర్ అవార్డు పొందారు. లింబాద్రి, రమేష్ బాబు, యాదగిరి ఉత్తమ అవార్డులు అందుకున్నారు. లక్ష్మినారాయణ, కరిపె రవీందర్, గురుప్రసాద్, తాటికొండ సత్యనారాయణ అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు.