లింక్ క్లిక్ చేస్తే రూ.5 లక్షలు మాయం

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లాలో ఓ రైతును సైబర్ మోసగాళ్ళు లూటీ చేశారు. బ్యాంకు ఖాతా నుంచి రూ 5.36 లక్షలు కాజేశారు. డొంకేశ్వర్ మండలం నూత్పల్లికి చెందిన రైతు రాజేందర్ తన ఫోన్ కు వచ్చిన మెసేజ్ లింకును క్లిక్ చేశాడు. అనంతరం తన బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయినట్లు గుర్తించాడు. ఖాతా వివరాలు పరిశీలించగా రూ.5, 36,700 నగదును సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.