విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానం అవసరం

0

అక్షరటుడే,మేడ్చల్: విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానం అవసరమని ప్రధానోపాధ్యాయులు ఎం.రాజేష్ రెడ్డి అన్నారు. మేడ్చల్ పరిధిలోని శ్రీ చైతన్య పాఠశాల సిబిఎస్ఈ గుండ్ల పోచంపల్లి శాఖలో నాసా వారు నిర్వహించే 117 NSS స్పేస్ షటిల్ మెంట్ కాంటెస్ట్ పై విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. బ్యాడ్జిలు, అంతరిక్ష సమాచారం తెలిపే పుస్తకాలను పంపిణీ చేశారు. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల ప్రతిభకు ఇది చక్కని నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భూమి మీద కాకుండా అంతరిక్షంలో మానవుడు జీవించడానికి అనువైన ప్రదేశాల గురించి ఈ నాసా ప్రాజెక్టులో రిసెర్చ్ చేస్తారని ముఖ్య అతిథిగా పాల్గొన్న డా.ఓం ప్రకాశ్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ శ్రీమతి సీమ, కొంపల్లి జోన్ ఏజీఎం జివి.రమణా రావు, ప్రధానోపాధ్యాయులు రాజేష్ రెడ్డి, కో ఆర్డినేటర్ జైపాల్ రెడ్డి, డీన్ సోమేష్ , విక్రమ్ సింహా రెడ్డి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.