అక్షరటుడే, ఇందూరు: ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా తెలిపారు. ప్రొఫెసర్-6, అసిస్టెంట్ ప్రొఫెసర్-4, ట్యూటర్-10, సివిల్ అసిస్టెంట్ సర్జన్-6, జూనియర్ రెసిడెంట్-18 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను ఫిబ్రవరి 3వ తేదీలోగా సమర్పించాలన్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య కళాశాలలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 6న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 7న ఇంటర్వ్యూల ద్వారా తుది ఎంపిక ఉంటుందని తెలిపారు.