షబ్బీర్ వైపు ఏఐసీసీ మొగ్గు

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థిత్వం కీలక మలుపు తిరిగింది. మాజీ మంత్రి, సీనియర్ నేత షబ్బీర్ అలీని ఇక్కడి నుంచి బరిలోకి దించాలని అధిష్ఠానం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కామారెడ్డిలో పిసిసి చీఫ్ రేవంత్ పోటీ చేస్తుండగా..సర్దుబాటులో భాగంగా షబ్బీర్ కు అర్బన్ టికెట్ కేటాయించాలని భావిస్తున్నారు. ఇక్కడ మైనార్టీ ఓటర్లు 1.20 లక్షలు పైబడి ఉన్నారు. ఇదే అంశంపై ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో బుధవారం రాత్రి వరకు చర్చలు జరిగాయి. నేడు మధ్యాహ్నం రెండో జాబితాను విడుదల చేయనున్నారు.