అక్షరటుడే, జుక్కల్: బిచ్కుంద-జుక్కల్ రహదారిపై రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి 24 గంటల పాటు రైతులకు విద్యుత్తు సరఫరా ఇవ్వటం లేదని వారు ఆరోపించారు. అధికారులు స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో రైతులు ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు కరెంట్ సరఫరా పైన బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని సీఎం కేసీఅర్ ప్రకటించినా రైతులు రొడ్లెక్కి ధర్నాలు చేస్తుండటం గమనార్హం.