Trump Gold Card | ట్రంప్​ గోల్డ్‌ కార్డుకు భలే గిరాకీ..

Trump Gold Card | ట్రంప్​ గోల్డ్‌ కార్డుకు భలే గిరాకీ..
Trump Gold Card | ట్రంప్​ గోల్డ్‌ కార్డుకు భలే గిరాకీ..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump Gold Card : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన ‘గోల్డ్‌ కార్డు’కు భలేగా గిరాకీ ఉంది. ఒక్కరోజే 1000 కార్డులు విక్రయించినట్లు అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌ ప్రకటించారు. వీటి ద్వారా 5 బిలియన్‌ డాలర్లు సేకరించినట్లు వెల్లడించారు. ఇంకా లక్షలాది మంది ఈ కార్డు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మొత్తం మీద ఈ కార్డుల ద్వారా ఐదు ట్రిలియన్‌ డాలర్ల వరకు సేకరించనున్నట్లు హోవర్డ్‌ చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement

‘ప్రపంచ వ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ ట్రంప్​ గోల్డ్ కార్డు కొనే సామర్థ్యం ఉంది. కనీసం 10 లక్షల మందైనా కొనుగోలు చేస్తారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ భావిస్తున్నారు’ అని లుట్నిక్‌ చెప్పారు.

ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్​ వీసా ఈబీ-5 స్థానంలో ఈ గోల్డ్‌ కార్డు తీసుకురానున్నారు. 5 మిలియన్‌ డాలర్లు చెల్లించేవారికి నేరుగా అమెరికా పౌరసత్వం అందజేస్తారని అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల చెప్పారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Donald Trump | ట్రంప్ సుంకాల మోత‌.. యూఎస్‌కు దిగుమ‌త‌య్యే అన్ని వాహ‌నాల‌పై 25 శాతం టాక్స్‌

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నులను ఆకర్షించేందుకే ఈ గోల్డ్‌ కార్డు ప్రవేశపెట్టినట్లు చెప్పుకొచ్చారు. వారంతా అమెరికాకు వచ్చి ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని, అమెరికాకు ఆదాయం పెరుగుతుందని ట్రంప్ ఇటీవల అన్నారు.

1990లో అమెరికా ఈబీ-5 వీసా విధానాన్ని తీసుకొచ్చింది. వేలాది మంది ఈ ఇన్వెస్టర్‌ వీసాలు అందుకున్నారు. కాగా, ఈ విధానంలో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారనేది ఓ అధ్యయనంలో తేలడంతో 2022లో కొన్ని సవరణలు తీసుకొచ్చారు. ఇప్పుడు దీని స్థానంలోనే గోల్డ్‌ కార్డు తీసుకొస్తున్నారు.

Advertisement