అక్షరటుడే,వెబ్‌డెస్క్ : అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల ముందు నుంచి 4,500 ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అందులో 80 శాతానికి పైగా ఎయిర్‌టెల్ కస్టమర్ల ఫోన్లు ట్యాప్ చేసిన అనంతరం ఎయిర్‌టెల్ సర్వీస్ ప్రొవైడర్‌ను, ట్యాప్ చేసిన 340 జీబీ సమాచారాన్ని ప్రణీత్‌రావు ధ్వంసం చేశారు. కాంగ్రెస్‌కు చెందిన 190 మంది నేతలలో..అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సోదరులు, మిత్రులు, అనుచరుల ఫోన్లు అలాగే బీజేపీ నేత ఈటల రాజేందర్, గన్‌మెన్, పీఆర్వో, సెక్యూరిటీ సిబ్బంది ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయి.