అక్షర టుడే, వెబ్ డెస్క్: Office Toilet : డబ్బు సంపాదించేందుకు ప్రతి ఒక్కరూ నానా తంటాలు పడుతుంటారు. ఇక డబ్బుని సంపాదించడం ఒకటైతే ఆదా చేయడం మరో ముఖ్యమైన పని. కేవలం డబ్బు ఆదా చేయడం కోసం ఏకంగా ఆఫీసు టాయిలెట్‌నే (Office Toilet) తన ఇల్లుగా మార్చేసుకున్న యువతి స్టోరీ (Young woman story) తెలుసుకొని అందరు అవాక్కవుతున్నారు. యాంగ్ (Yang) అనే 18 ఏళ్ల చైనా యువతి ఓ ఫర్నిచర్ స్టోర్‌లో పనిచేస్తోంది. ఖర్చులను తగ్గించుకునేందుకు ఆమె కార్యాలయంలోని టాయిలెట్‌ను అద్దెకు తీసుకుని అందులోనే నివాసం ఉంటోంది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. ఆమె తన యజమానికి నెలకు కేవలం £5 పౌండ్లు (భారతీయ కరెన్సీలో ₹545) చెల్లిస్తోంది.
Office Toilet : మరీ ఇంత పొదుపా?
యాంగ్ మొదట నెలకు £21 పౌండ్లు (₹2,290) చెల్లించడానికి సిద్ధపడినప్పటికీ ఆమె యజమాని విద్యుత్ , నీటి ఖర్చులను మాత్రమే వసూలు చేస్తూ ఆమెను తక్కువ మొత్తానికే అనుమతించడం జరిగింది. నిజానికి.. స్టోర్ యాజమాన్యం ఆమెకు ఉండడానికి ఆఫీస్‌లోనే ఓ గది ఇచ్చినా, దానికి డోర్ లేకపోవడంతో అసౌకర్యంగా ఉందని యాంగ్ భావించింది. గతంలో ఆమె తన యజమాని ఇంట్లోనే ఉండేది. నెలకు దాదాపు £317 పౌండ్లు (₹34,570) సంపాదిస్తున్న యాంగ్, కేవలం £42 (₹4,580) మాత్రమే ఖర్చు చేస్తూ తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఆదా చేస్తోంది.
ఆమె తన రోజువారీ జీవితాన్ని చైనా సోషల్ మీడియా ‘డౌయిన్’లో పంచుకుంటుంది. అక్కడ ఆమెకు 16,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే టాయిలెట్‌లో ఒక మడత మంచాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఇతరులు లోపలికి రాకుండా కూడా సేఫ్టీగా ఉంటుంది.. ఆమెకు దుస్తులు పెట్టుకోవడానికి ఒక రాడ్ ఉంది. అంతేకాకుండా ఆమె పోర్టబుల్ హాబ్ ఉపయోగించి టాయిలెట్‌లోనే వంట కూడా చేసుకుంటుంది. ఒక గుడ్డ పరిచిన అంచుపై కూరగాయలు చక్కగా పెట్టుకుని, చాపింగ్ బోర్డుపై ఆహారం తయారుచేస్తూ కనిపించింది. యాంగ్ తన దుస్తులు కూడా టాయిలెట్‌లోనే ఉతుకుతుంది. భవనం పైకప్పుపై ఆరబెడుతుంది. ఉద్యోగులు టాయిలెట్‌ను ఉపయోగించడానికి వీలుగా ఆమె తన వస్తువులన్నింటినీ సర్దుకుంటుంది. భవిష్యత్తులో ఒక ఇల్లు లేదా కారు కొనడానికి తగినంత డబ్బు ఆదా చేయాలని యాంగ్ ఇలా చేస్తుంది.