అక్షరటుడే, బోధన్: బోధన్ నియోజకవర్గంలో ఈ నెల 2న(గురువారం) యువ గర్జన నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. శక్కర్ నగర్ క్రీడా మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు భారీ సభ ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారని, నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, యువత అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.