అక్షరటుడే, వెబ్డెస్క్: 7th Pay Commission | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు(central government employees) కేంద్రం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. డీఏ(DA hike) పెంపు కోసం ఉద్యోగులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ.. త్వరలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరగబోయే కేబినేట్ మీటింగ్ లో డీఏ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈనేపథ్యంలో ఈసారి డీఏను 2 శాతం పెంచనున్నట్టు సమాచారం. అంటే ప్రస్తుతం డీఏ 53 శాతంగా ఉంది. 2 శాతం పెంచితే 55 శాతానికి చేరుకోనుంది. ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏను కేంద్రం పెంచుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను కేంద్రం పెంచుతూ ఉంటుంది. బేసిక్ పే ఆధారంగా డీఏను కేంద్రం పెంచుతుంది.
7th Pay Commission | ఈసారి పెరగనున్న డీఏతో ఎంత జీతం పెరగనుంది?
ఉదాహరణకు లక్ష రూపాయల బేసిక్ పే ఉన్న ఉద్యోగికి డీఏ 55 శాతం ప్రకారం లెక్క వేస్తే అది రూ.55 వేలతో సమానం అవుతుంది. ప్రతి సంవత్సరం జనవరి, జులైలో డీఏ పెరుగుతుంది. కానీ, ఈ సంవత్సరం రెండు నెలలు గడిచినా ఇంకా డీఏ పెంపుపై ఎలాంటి ప్రకటన రాలేదు.