IPS TRANSFERS | రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్​ల బదిలీ
IPS TRANSFERS | రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్​ల బదిలీ
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్​లు బదిలీ అయ్యారు. మొత్తంగా 21 మందిని ట్రాన్స్​ఫర్​ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడిషనల్​ డీజీలతో పాటు ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలను బదిలీ చేసింది. నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య, కరీంనగర్​ సీపీగా గౌస్​ ఆలం, కామారెడ్డి ఎస్పీగా రాజేశ్​ చంద్రగా ట్రాన్స్​ఫర్​ అయ్యారు.

 

ఆదిలాబాద్​ ఎస్పీగా అఖిల్​ మహాజన్​, సంగారెడ్డి ఎస్పీగా పంకజ్​ పరితోష్​, వరంగల్​ సీపీగా సన్​ప్రీత్​ సింగ్​, ఇంటలిజెన్స్​ ఎస్పీగా సింధు శర్మ, భువనగిరి ఎస్పీగా అక్షాంక్ష్​ యాదవ్​, సిరిసిల్ల ఎస్పీగా గీతె మహేశ్​ సాహెబ్​, మంచిర్యాల డీసీపీగా భాస్కర్​, పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్‌​, హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా శిల్పవల్లి, సూర్యాపేట ఎస్పీగా నర్సింహా, సీఐడీ ఎస్పీగా రవీందర్​, రామగుండం ఎస్పీగా అంబర్​కిషోర్​ జా నియామకం అయ్యారు.

Advertisement