Jubilee Hills | పెళ్లి పేరుతో వల వేసి.. 24 మందిని మోసం చేశాడు

Jubilee Hills | పెళ్లి పేరుతో వల వేసి 24 మందిని మోసం చేశాడు
Jubilee Hills | పెళ్లి పేరుతో వల వేసి 24 మందిని మోసం చేశాడు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Jubilee Hills | పెళ్లి పేరుతో వల వేసి 24 మంది యువతులను మోసం చేశాడో మాయగాడు. సోషల్ మీడియా(Social Media) వేదికలు, మ్యాట్రిమొని సైట్ల ద్వారా యువతులతో పరిచయం పెంచుకొని పెళ్లి(Marriage) చేసుకుంటానని నమ్మించేవాడు. అనంతరం తనకు డబ్బు అవసరం ఉందని వారి చేత డబ్బులు వేయించుకొని మోసం చేసేవాడు. బాధితుల ఫిర్యాదు మేరకు తాజాగా ఈ కేటుగాడిని జూబ్లీహిల్స్​ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

Advertisement

Jubilee Hills | బోగస్​ పేర్లు.. అందమైన యువకుల ఫొటోలు

రాజమండ్రికి(Rajamandri) చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి (33) అనే యువకుడు మ్యాట్రిమోని(Matrimony) సైట్లలో బోగస్​ పేర్లతో రిజిస్టర్​ చేసుకొని అందమైన యువకుల ఫొటోలు పెట్టేవాడు. దీంతో పాటు సోషల్​ మీడియా వేదికల ద్వారా కూడా యువతులతో పరిచయం పెంచుకునేవాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. కొన్నాళ్ళ పరిచయం తర్వాత ఎమర్జెన్సీ ఉందని వివిధ కారణాలు చెబుతూ సదరు యువతుల నుంచి డబ్బు(Money) తీసుకునేవాడు. తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి, మరిన్ని డబ్బులు లాగేవాడు. ఆ డబ్బులతో జల్సాలు చేసేవాడు.

Jubilee Hills | ఇలా చిక్కాడు..

జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న ఓ వైద్యురాలిని (Doctor) పరిచయం చేసుకున్నాడు. తన పేరు హర్ష చెరుకూరి అని, తాను బిజినెస్ చేస్తున్నానని నమ్మించాడు. తన తల్లి చికాగోలో వైద్యురాలిగా పనిచేస్తుందని నమ్మించాడు. తన తల్లి ఇండియాకు వచ్చాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే తన అకౌంట్లను ఐటీ అధికారులు సీజ్​ చేశారని అర్జెంట్​గా డబ్బు అవసరం ఉందని ఆమెను అడిగాడు. దీంతో ఆమె విడతల వారీగా రూ.10.94 లక్షలను హర్ష సూచించిన అకౌంట్లకు పంపింది. తర్వాత అతను పట్టించుకోవడం మానేశాడు. ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు(Police) ఫిర్యాదు చేయగా హర్ష చెరుకూరిపై కేసులు నమోదు చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth | ఆ వాహనాలకు నగరంలోకి నో ఎంట్రీ..!

Jubilee Hills | వెలుగులోకి షాకింగ్​ విషయాలు

కేసు దర్యాప్తు చేపట్టిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అతడు ఏపీ, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల్లో ఇదే విధంగా పలు మోసాలకు పాల్పడినట్లు తేలింది. 2016 నుంచి వంశీకృష్ణ 24 మంది యువతులను ఈ విధంగా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో కొన్ని కేసుల్లో అరెస్టు అయిన వంశీ కృష్ణ బెయిల్ మీద బయటకు వచ్చి తన మోసాలు కొనసాగించినట్లు గుర్తించారు.