అక్షరటుడే, బాన్సువాడ: డివిజన్ పరిధిలోని రేషన్ డీలర్ల నియామకానికి సంబంధించిన ఆర్డర్ కాపీలు ఇవ్వాలని సోమవారం సబ్ కలెక్టర్ కిరణ్మయికి 28 మంది అభ్యర్థులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీలర్ల ఖాళీల భర్తీ కోసం గత నెల రాత పరీక్ష నిర్వహించారని, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణులయ్యామని, ఇప్పటివరకు ఆర్డర్ కాపీ ఇవ్వలేదని వివరించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఆర్డీవో కార్యాలయానికి పంపించారన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వివరించారు. సమస్య పరిష్కరిస్తానని సబ్ కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.