అక్షరటుడే, ఇందూరు: స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ఈనెల 29న నిర్వహించనున్నట్లు డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. 20న ఎన్నికల నోటిఫికేషన్, అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల జాబితాను ప్రదర్శిస్తామన్నారు. 22న అభ్యంతరాలు స్వీకరణ, 24న తుది జాబితా ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం1.30 గంటల వరకు ఎన్నికలు ఉంటాయని, అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు తొలి సమావేశం జరుగుతుందన్నారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సహా ఒక్కో తరగతి నుంచి ఎన్నికైన ముగ్గురు తల్లిదండ్రులు సభ్యులుగా, పాఠశాల హెచ్ఎం సభ్య కన్వీనర్‌గా ఉంటారు.