అక్షరటుడే, డిచ్పల్లి: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఈ నెల 29న పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ చిలివేరి దాసు తెలిపారు. డిచ్పల్లి మండలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎస్ఎల్జీ గార్డెన్ లో ఆదివారం ఉదయం సమ్మేళనం ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని పద్మశాలి సోదరులందరు హాజరు కావాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో శక్కరికొండ కృష్ణ, శేఖర్, తన్నీరు వాసు, చిలుక రాజేశ్వర్, లోలం జగదీశ్వర్, భూమన్న, అంకం నరహరి తదితరులు పాల్గొన్నారు.