అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా జీవో.317 బాధితులు బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ను ముట్టడించారు. గాంధీభవన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. బాధితులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే జీవో.317 సమస్యను పరిష్కరిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారని గుర్తు చేశారు. సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి జీవో.317 బాధితులను స్థానిక జిల్లాలకు పంపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.