అక్షరటుడే, వెబ్‌డెస్క్: Transfer of judges | రాష్ట్రంలో పలువురు న్యాయమూర్తులు బదిలీ district judges transfers అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 మంది జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ న్యాయమూర్తులను (Principal Sessions Judges) బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్(Registrar of the High Court) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నిర్మల్ జిల్లా జడ్జి స్వర్ణకుమార్ ఎల్బీ నగర్‌కు బదిలీ అయ్యారు. కరీంనగర్(karimnagar) జిల్లా జడ్జి ప్రతిమ జనగాంకు, కుమార్ వివేక్ కరీంనగర్ ఏసీబీ కోర్టు నుంచి సెకండ్ అడిషనల్ ఆదిలాబాద్ జిల్లా సెషన్స్ జడ్జిగా ట్రాన్స్ఫర్ అయ్యారు.
లక్ష్మీకుమారి కరీంనగర్ నుంచి మూడవ అదనపు జడ్జి అదిలాబాద్(adilabad)కు బదిలీ అయ్యారు. అలాగే జగిత్యాల జిల్లా జడ్జి నీలిమ మెదక్‌కు, రాజన్న సిరిసిల్ల జడ్జి గద్వాల్‌కు, నారాయణ పేట్ జిల్లా జడ్జి అబ్దుల్ రఫీక్ మహబూబాబాద్‌కు, నాగర్‌కర్నూల్ జిల్లా జడ్జి రాజేశ్‌బాబు వక్ఫ్ బోర్డు ట్రిబ్యూనల్ ఛైర్మన్‌గా, మెదక్ జిల్లా జడ్జి లక్ష్మీ శారద సూర్యాపేటకు బదిలీ అయ్యారు.
నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల పెద్దపల్లి, బోధన్ జడ్జి రవికుమార్ గద్వాలకు ట్రాన్స్ఫర్ అయ్యారు. కామారెడ్డి జడ్జి లాల్‌సింగ్ శ్రీనివాస నాయక్ మంచిర్యాలకు, రత్నపద్మావతి ఎల్బీనగర్ నుంచి జగిత్యాలకు బదిలీ చేశారు. పట్టాభిరామారావు ఎల్బీనగర్ నుంచి హన్మకొండకు, ముక్తిదా ఎల్బీనగర్ నుంచి యాదాద్రి భువనగిరికి, జయప్రసాద్ ఎల్బీ నగర్ నుంచి సిద్దిపేట్‌కు, హరీషా ఎల్బీనగర్ నుంచి నిజామాబాద్ ఎస్సీ,ఎస్టీ కోర్టుకు బదిలీ అయ్యారు.
ప్రదీప్‌నాయక్ ఎల్బీనగర్ 7వ అదనపు జిల్లా జడ్జి నుంచి ఎల్బీనగర్ 6వ అదనపు జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. కవిత ఎల్బీ నగర్ నుంచి కరీంనగర్ ఫ్యామిలీ కోర్టుకు, విక్రమ్ మేడ్చల్ మల్కాజ్గిరి(నేరేడ్‌మెంట్) నుంచి ఏసీబీ కోర్టు కరీంనగర్‌కు, నారాయణ బాబు జయశంకర్ భూపలపల్లి నుంచి కోఆపరేటివ్ ట్రిబ్యునల్ ఛైర్మన్ వరంగల్‌కు బదిలీ అయ్యారు.
శివకుమార్ హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు, సరిత సికింద్రాబాద్ నుంచి బద్రాద్రి కొత్తగూడెం, రమాకాంత్ హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్, వినోద్‌కుమార్ సెకండ్ అడిషనల్ మెట్రోపాలిటన్ నుంచి ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ జడ్జిగా బదిలీ అయ్యారు. పుష్పలత హైదదరాబాద్ నుంచి రాజన్న సిరిసిల్లకు, మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు ట్రాన్స్ఫర్ చేశారు.
జీవీఎన్ భరతలక్ష్మి లేబర్ కోర్టు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ సెషన్స్ జడ్జిగా వెళ్లనున్నారు. ఉష గద్వాల్ నుంచి హైదరాబాద్ సిటీకి, రమేశ్‌బాబు హన్మకొండ నుంచి జయశంకర్ భూపాలపల్లికి, శశిధర్ రెడ్డి ఎల్బీనగర్ నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. శ్రీదేవి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి(కుషాయిగూడ)కు, వీరయ్య సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల జిల్లా జడ్జిగా, శ్రీవాణి సికింద్రాబాద్ నుంచి నిర్మల్ జిల్లా జడ్జిగా, నీరజ హైదరాబాద్ నుంచి రాజన్న సిరిసిల్లకు, పి.శివరామ ప్రసాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు అదిలాబాద్ నుంచి జిల్లా జడ్జి అదిలాబాద్గా, శ్యాంశ్రీ సూర్యాపేట నుంచి సికింద్రాబాద్‌కు, బోయ శ్రీనివాసులు మంచిర్యాల నుంచి నారాయణ పేట్ బదిలీ అయ్యారు.