రూ.50 కోట్ల ధాన్యం పక్కదారి.. మిల్లుపై పోలీసు కేసు

0

అక్షరటుడే, బాన్సువాడ: కోటగిరి మండలం పోతంగల్ లో ఓ మిల్లర్ పెద్ద మొత్తంలో సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించాడు. రూ.50 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని అర్కం ట్రేడర్ మిల్లర్ అమ్ముకున్నట్లు సివిల్ సప్లై అధికారులు తేల్చారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తదుపరిగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ బంధువుల పేరిట ఉన్న మిల్లుగా సమాచారం.