అక్షరటుడే, వెబ్డెస్క్: UAE | రంజాన్ Ramadan సందర్భంగా యూఏఈ అక్కడి జైళ్లలో ఉన్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. ఇందులో భాగంగా సుమారు 1,300 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రధాని Prime Minister షేక్ మోహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా 1,518 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విడుదలైన ఖైదీల్లో 500 మందికిపైగా భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.
UAE | సత్ప్రవర్తన ఆధారంగా..
యూఏఈలో రంజాన్ సందర్భంగా ఇలా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం.. ఆనవాయితీగా వస్తోంది. అయితే సత్ప్రవర్తనను good behavior ఆధారంగా ఖైదీలను ఎంపిక చేసి విడుదల చేస్తుంటారు. అంతేకాదు వాళ్లు జనజీవన స్రవంతిలో కలిసేందుకు అవసరమైన ఆర్థిక సాయం కూడా అందించనున్నట్లు సమాచారం.
UAE | మరింత బలపడనున్న భారత్ – యూఏఈ బంధం
భారత్ – యూఏఈ మధ్య ఏళ్లుగా బలమైన సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు తీసుకున్న నిర్వయం రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి.