Cyber Fraud | ఫోన్‌లో ఆధార్ వివరాలు అడిగారు.. రూ.20 కోట్లు అకౌంట్ నుంచి కొట్టేశారు!

Cyber Fraud | ఫోన్‌లో ఆధార్ వివరాలు అడిగారు.. రూ.20 కోట్లు అకౌంట్ నుంచి కొట్టేశారు!
Cyber Fraud | ఫోన్‌లో ఆధార్ వివరాలు అడిగారు.. రూ.20 కోట్లు అకౌంట్ నుంచి కొట్టేశారు!
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Cyber Fraud | ఈరోజుల్లో సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలుసు. సైబర్ నేరాలు, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రభుత్వాలు, సైబర్ నిపుణులు ఎప్పటికప్పుడు ప్రజలను హెచ్చరిస్తూనే ఉంటున్నారు. అయినా కూడా కొందరు సైబర్ నేరగాళ్ల వలలో పడి లక్షలు పోగొట్టుకుంటున్నారు.

తాజాగా ఓ మహిళ అయితే ఏకంగా రూ.20 కోట్లు పోగొట్టుకున్నారు. పోలీసు అధికారులమని చెప్పి ఫోన్ చేసి ఆధార్ డిటెయిల్స్ అడిగి మహిళ దగ్గర రూ.20 కోట్ల మేర కొట్టేశారు సైబర్ క్రిమినల్స్. ఈ ఘటన ఆర్థిక రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. పోలీసులమని చెప్పి 86 ఏళ్ల వృద్ధ మహిళకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఆమె ఆధార్ కార్డును అక్రమంగా వేరే వాళ్లు ఉపయోగిస్తున్నారని ఆ కేసు పరిష్కరించడానికే తమను పోలీస్ అధికారులు నియమించారని నమ్మబలికారు. ఆ కేసును పరిష్కరించడం కోసం ఆమె బ్యాంక్ నుంచి ఇతర బ్యాంక్ ఖాతాలకు డబ్బులు బదిలీ చేయాలని చెప్పారు.

Cyber Fraud | గుడ్డిగా నమ్మి రూ.20 కోట్లు బదిలీ..

సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మిన ఆ మహిళ గత ఏడాది డిసెంబర్ 26 నుంచి ఈ మార్చి 3వ తేదీ వరకు పలు దఫాలుగా రూ.20.25 కోట్ల మేర వాళ్లు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశారు. ఆధార్ కార్డు, వ్యక్తిగత సమాచారం అడిగి దాన్ని అక్రమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని చెప్పి చివరకు క్రిమినల్స్ ఆమెను బెదిరించడం స్టార్ట్ చేశారు. ఆమె కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని ఉండాలని చెప్పడంతో బాధిత మహిళ కూడా ఎవ్వరికీ ఈ విషయాలు చెప్పకుండా వాళ్లు చెప్పిన విధంగా డబ్బులు పంపించింది. ఆ తర్వాత మోసం జరిగిందని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించింది.  పోలీసులు కేసు నమోదు చేసి ఆ సైబర్ నేరగాళ్లను పట్టుకునే పనిలో పడ్డారు.

Advertisement