8th Pay Commission : 8వ వేతన సంఘం వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. లక్షల్లో పెరగనున్న జీతాలు?

8th Pay Commission : 8వ వేతన సంఘం వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. లక్షల్లో పెరగనున్న జీతాలు?
8th Pay Commission : 8వ వేతన సంఘం వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. లక్షల్లో పెరగనున్న జీతాలు?

అక్షరటుడే, వెబ్ డెస్క్: 8th Pay Commission : ప్రస్తుతం Central Government కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా 8వ వేతన సంఘం (8th Pay Commission) ఎప్పుడు అమలులోకి వస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం కూడా 8వ వేతన సంఘం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడో వేతన సంఘం ప్రారంభమై కూడా 10 ఏళ్లు దాటింది. 2014 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం 7వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. దాన్ని 2016లో కాస్త మార్పులు చేసి అప్పటి నుంచి ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తోంది.

Advertisement
Advertisement

ఒకవేళ 8వ వేతన సంఘం( 8th Pay Commission) అమలులోకి వస్తే, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ఎంత అమలు చేస్తారు? డీఏ ఎంత పెరుగుతుంది? ఇతర అలవెన్సులు మాటేమిటి? అంటూ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో పెద్ద చర్చ నడుస్తోంది. కేంద్ర మాజీ ఫైనాన్స్ సెక్రటరీ సుభాష్ చంద్ర గార్గ్, 8వ వేతన సంఘం గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ వచ్చే పే కమిషన్ లో 1.92 నుంచి 2.08 వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు. లేదు.. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ఈసారి 2.86 ఉంటుంది అని నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ స్టాఫ్ శివ్ గోపాల్ మిశ్రా అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చ‌ద‌వండి :  DA Hike News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అదిరిపోయే శుభ‌వార్త‌.. 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం

8th Pay Commission : 100 శాతం జీతం పెరుగుతుందా?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central government employees మాత్రం (8th Pay Commission) 8వ వేతన సంఘం వస్తే తమ జీతాలు 100 శాతం పెరుగుతాయని ఆశిస్తున్నారు. నిజానికి ఈసారి జీతాల పెంపు అంత ఉండకపోవచ్చు. ఎందుకంటే, గతంలో ఏర్పాటైన కమిషన్లను పరిగణనలోకి తీసుకుంటే, 2వ వేతన సంఘం ఏర్పాటయినప్పుడు 14.2 శాతం జీతం పెంచారు. మూడో కమిషన్ సమయలో 20.6 శాతం, 4వ వేతన సంఘం సమయంలో 27.6 శాతం, 5వ వేతన సంఘం సమయంలో 31 శాతం, 6వ వేతన సంఘం సమయంలో 54 శాతం జీతం పెంచారు. 7వ వేతన సంఘం ఏర్పాటు సమయంలో 14.3 శాతమే పెంచారు. ప్రస్తుతం డీఏ కూడా 53 శాతం ఉంది. త్వరలో డీఏ కూడా పెరగాల్సి ఉంది కాబట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్, డీఏ, ఇతర అలవెన్సులు అన్నీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగానే జీతాలు పెరగనున్నాయి.

Advertisement