అక్షరటుడే, నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కొద్ది గంటల ముందు నిజామాబాద్ నగరంలో వడగండ్ల వాన భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. దీంతో ఇళ్ళల్లో బోర్లు పనిచేయక, ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి పంపింగ్ మోటార్లు పనిచేయక గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని నగరపాలక సంస్థ ప్రకటించింది. నాగారం, ఇంద్రాపూర్, వినాయక్ నగర్, గోల్ హనుమాన్, ఎల్లమ్మగుట్ట,సుభాష్ నగర్, నాందేవ్ వాడ, గంగస్థాన్, హమాల్వాడి, దుబ్బ, గౌతంనగర్, కంటేశ్వర్, చంద్రశేఖర్ కాలనీ, ఎల్లమ్మగుట్ట, పోచమ్మ గల్లి, గోల్ హనుమాన్, అర్సపల్లి, మాలపల్లి, అహ్మద్ పుర కాలనీ, హబీబ్ నగర్ లో తాగునీటి సరఫరా ఉండదు. పోలింగ్ కు కొద్ది గంటల ముందు.. ఒకవైపు కరెంటు ఇంకోవైపు తాగునీటి కష్టాలు ఎదుర్కొనడం గమనార్హం.