అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు దాదాపు అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. వానలు పడుతుండడంతో ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి 18275 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. గత 24 గంటల్లో జలాశయంలోకి ఒకటిన్నర టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చింది. అలాగే గోదావరి నది కూడా జలకళ కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వానలు పడుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో బిజీగా మారారు.