అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన కళ్యాణి ప్రాజెక్ట్ రెండు వరద గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు నుంచి 450 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి, మరో 200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ఆయకట్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్లకు గాను ప్రస్తుతం 408.50 మీటర్లు నీరు నిల్వ ఉండగా.. ఎగువ భాగం నుంచి 650 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లోగా వస్తున్నట్లు ఏఈ శివకుమార్ తెలిపారు.