అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్‌ ప్రాజెక్టు గల నీటిపారుదల శాఖ భవనంలో నివాసం ఉంటున్న మత్స్య కార్మికులను అధికారులు ఖాళీ చేయించారు. మత్స్య కార్మికులు భవనంలో నివాసం ఉంటూ.. ప్రాజెక్టు వద్ద ఉద్యోగులకు బదులు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ‘ఉద్యోగం వీరిది.. విధులు వారివి’ శీర్షికన ఈనెల 16న ‘అక్షరటుడే’లో ప్రచురితమైన కథనానికి నీటిపారుదల శాఖ అధికారులు స్పందించారు. శాఖకు చెందిన భవనాల్లో కార్మికులను ఖాళీ చేయించారు. ఈ భవనాల్లో ఉద్యోగులు తప్ప ఇతరులు నివాసం ఉండవద్దని ఆదేశించారు. ఉద్యోగులు ప్రతినిత్యం వారికి కేటాయించిన సమయంలో విధులు నిర్వహించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.