అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ నగరానికి మినీ స్టేడియం కేటాయించి క్రీడాకారులను ప్రోత్సహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన నిఖత్ జరీన్, హుసాముద్దీన్, సౌందర్య, ఆనంద్ వంటి క్రీడాకారులు ఉన్నారని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానం స్ధలంలో మినీ స్టేడియం నిర్మించి క్రీడాకారులకు తోడుగా నిలవాలన్నారు. అలాగే పాత ఇరిగేషన్ భవనం వద్ద గల రెండెకరాల స్థలంలో ఇండోర్ స్టేడియాన్ని నిర్మించాలని, నాగారంలోని రాజారాం స్టేడియంను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.