అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ప్రధానమైన నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలతో డ్యాంలలోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శ్రీరాంసాగర్‌ జలాశయంలోకి ప్రస్తుతం 19,150 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1091 అడుగులు (80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1071.6 అడుగులు(26.111) టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం డ్యాంలోకి 850 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1388.32 అడుగుల (3.41 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.