నగర శివారులో క్షుద్రపూజల కలకలం

Advertisement

అక్షరటుడే, నిజామాబాద్: నగర శివారులోని మాణిక్ భండార్ తండా సమీపంలో క్షుద్ర పూజల ఘటన కలకలం రేపింది. గురువారం రాత్రి స్థానిక శ్మశాన వాటికలో కొందరు చేతబడి చేస్తున్నారనే సంచారంతో గ్రామస్థులు అక్కడికి వెళ్లారు. మేకను బలి ఇచ్చినట్లు గుర్తించి అక్కడ ఉన్న వారిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. అయినా స్థానికులు వినలేదు. పోలీసు వాహనంలో తరలిస్తున్న వారిపైనా గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసం అయినట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. మాక్లూర్ టౌన్ లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఘటన జరిగిన ప్రాంతంలో పికెట్ ఏర్పాటు చేశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Congress party | కాంగ్రెస్​లో పలువురి చేరిక