అక్షరటుడే, వెబ్‌డెస్క్: పసిడి పరుగులకు బ్రేక్ పడింది. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం ధరలు నాలుగైదు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు రూ.74 వేలకు పైగా ఉన్న ధర ప్రస్తుతం రూ.మూడు వేల వరకు తగ్గింది. శుక్రవారం ఇందూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 71,400 రూపాయలు, 22 క్యారెట్లు 65,680 రూపాయలుగా ఉంది.
భారీగా పడిపోయిన వెండి ధరలు
పుత్తడితో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. 10 రోజుల క్రితం వరకు కిలోకు రూ.95 వేలకు పైగా పలికిన ధర ప్రస్తుతం రూ.86 వేలకు దిగివచ్చింది. ప్రస్తుతం పది గ్రాముల ధర రూ.865కు పడిపోయింది.